ప్రధానమంత్రి ఉజ్జల గ్యాస్ కనెక్షన్లు

 ప్రసాదరావు పట్నాయక్ చేతులమీదుగా  ప్రధానమంత్రి ఉజ్జల గ్యాస్ కనెక్షన్లు...

 భీమిలి: వి న్యూస్ ప్రతినిధి

భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో కుసులవాడ  గ్రామ పంచాయతీ లో రేగాన్ గూడెం రేగాన జట్లమ్మ కుటుంబానికి వెల్లంకి గ్రామం లో బిజేపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ చేతులు మీదుగా  ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అందజేయడం జరిగింది. 

ఈ సందర్భంగా పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్, మాట్లాడుతూ ఉజ్జల గ్యాస్ అన్నీ గ్రామపంచాయతీ నిరుపేదలకు, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఆనందపురం మండలంలో నిరుపేద కుటుంబాలకు 600 పైగా కుటుంబాలు అప్లై చేశారని వారందరికీ ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఇండియన్ గ్యాస్ డీలర్ ఏ.వి. సుబ్బా రాజు మాట్లాడారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లు,ఆనందపురం,భీమిలి, పద్మనాభం మండలాల్లో నిరుపేద కుటుంబాలకు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మంజూరు చేస్తామని తెలియజేశారు.ఈ సందర్భంగా రేగాన జట్లమ్మ మాట్లాడుతూ,మా కుటుంబానికి,   ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయించిన,బిజేపి నాయకులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. బిజేపి వెల్లంకి బూత్ స్థాయి  నాయకులు,పి.సాయి రమేష్,గండి లక్ష్మి రావు, బోర శ్రీను,దుక్క అప్పల సూరి, రౌత్ రమణ, కొమ్ము శంకర్, బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.