ఓబిసి విశాఖ జిల్లా అధ్యక్షునిగా పోతిన పైడి రాజు
( చిన్ని) ఏకగ్రీవ ఎన్నిక.
విశాఖ,వాల్తేర్, ; వి న్యూస్ ప్రతినిధి
విశాఖపట్నం, భారతీయ జనతా పార్టీ ఓబిసి విశాఖ జిల్లా అధ్యక్షునిగా పోతిన పైడి రాజు ( చిన్ని) ని నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు , ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు విశాఖ జిల్లా ఓబీసీ మాజీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసులు నాయుడు అధ్యక్షతన నియామక పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో ఓబీసీ ఉపాధ్యక్షులు ఓమ్మి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి సనపల రామకృష్ణ , ఓబీసీ విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ భోగాది స్వామి నాయుడు, పోతిన ప్రసాద్ , రుగడ శ్రీనివాస్, వివి రమణ , శంకర్, జామి శివాజీ రావు , రమణమ్మ, మొదలగువారు ఓబీసీ సభ్యులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

