అమ్మవారిని దర్శించుకున్న జీవీఎంసీ జోనల్ కమిషనర్ రాము

అమ్మవారిని దర్శించుకున్న జీవీఎంసీ జోనల్ కమిషనర్ రాము ..

మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి


విశాఖపట్నం  (జివియంసి జోన్ 2 ) మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువైయున్న శ్రీ పంచముఖ ఆంజనేయ

 శ్రీ షిర్డీ సాయినాధ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో  నవరాత్రి మూడవ రోజు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి సుప్రభాత సేవ తో ప్రారంభమై అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకములు ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో పట్నాల హరి ప్రసాద్ శర్మ, మూర్తి శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు, అనంతరం అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించడం జరిగింది,  అనంతరం సూర్య నమస్కారాలు, సహస్ర కుంకుమార్చనలు, ప్రత్యేకంగా గాజుల పూజా జరిపించి అనంతరం హోమం జరిపించడం జరిగింది నీరాజన మంత్ర పుష్పం, ప్రసాద వితరణ చేయడం జరిగింది, 

జివియంసి జోన్ 2 కమీషనర్ బొడ్డేపల్లి రాము దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు, ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఆలయ సాంప్రదాయ ప్రకారం దుశ్శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందించడం జరిగింది, చంద్రంపాలెం వాస్తవ్యులు షిర్డీసాయి ట్రాన్స్ పోర్ట్ వారు శ్రీ సామిరెడ్డి నర్సింహమూర్తి, శ్రీమతి పార్వతి దంపతుల  ఆర్థిక సహాయం తో ఈ రోజు ఆలయంలో అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేసిన ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది, సాయంత్రం కుంకుమార్చనలు, నీరాజన మంత్ర పుష్పం, పురాణ ఇతిహాసల నుండి స్వస్తులు మొదలగు పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది, పూజా కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలు పాటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా కృష్ణంనాయుడు, ప్రధాన కళశ ఏర్పాటు చేసిన బావిశెట్టి సత్యనారాయణ, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు యస్.యన్.మూర్తి, పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పీస మణి, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పోతిన శివ, దుర్గాశి శోభన్ బాబు, యస్.ఆర్.బాబు, గూడేల రాజు,  పిళ్లా సన్యాసిరావు, కేననకుర్తి అప్పారావు, బైపిల్లి సురేష్, పిళ్లా శ్రీను, గ్రామ పెద్దలు  పీస రామారావు, జగుపిల్లి నాని, పిళ్లా సత్యన్నారాయణ, ముఖ్య సభ్యులు జగుపిల్లి అప్పారావు, పోతిన వెంకటరమణ, పిళ్లా అప్పన్న, పిళ్లా వెంకటరమణ, సుందర శ్రీను, గూడేల కామేశ్వరరావు, యస్.రమేష్, పి.కనకారావు,  యమ్.బుల్లిబాబు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు