జగనన్న నీ పేరు మార్చుకో - టిఎన్ఎస్ఎఫ్ :
భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
ఆనందపురం బుధవారం మండలంలో తెలుగునాడు విద్యార్ది సమైక్య నియోజకవర్గ నాయకులు సర్వసభ్య సమావేశం. భీమిలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగునాడు విద్యార్ది సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చూసిన వాటిని పేర్లు మార్చుకుంటూ, కూల్చుకుంటూ రాక్షస పాలన సాగిస్తుందని, జగనన్న పేరు కూడా మార్చుకొని వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
విజయవాడ లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎన్టీఆర్ తెలుగు వారు అభిమానించే స్థానం నుంచి ఆరాధించే స్థాయికి ఎదిగిన శక్తి అని, మీరు పేరు మార్చినంత మాత్రాన చెరిగిపోదు, మాసిపోదు అని తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం పదిలం అని దానిని ఎవరూ మార్చలేరు అని కొనియాడారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే వైసీపీ కి బుద్ది చెపుతారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు విద్యార్ది సమైక్య నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోరాడ వైకుంఠ రావు, ఉపాధ్యక్షులు కంటుబోతు సుమంత్ నాయుడు, కార్యదర్శి బసన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

