ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శటీ పేరు మార్పు అంశంపై ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందన..
ఆంధ్రప్రదేశ్:
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహనరెడ్డి.మీరు ఎంతో పెద్ద మనసుతో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం..విప్లవాత్మకం..అదే జిల్లాలో ఎన్టీఆర్ చొరవతోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి- వల్లభనేని వంశీ

