పౌర హక్కులకు భంగం కలిగించే పోలీసు వారు (30) యాక్ట్ చట్టాన్ని ఎత్తివేయాలి.

పౌర హక్కులకు భంగం కలిగించే పోలీసు వారు (30) యాక్ట్ చట్టాన్ని ఎత్తివేయాలి:

హ్యూమన్  రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాకినీడి మణికంఠ స్వామి.

విశాఖ:

పౌర హక్కులకు భంగం కలిగించే పోలీసు వారు (30) యాక్ట్ చట్టాన్ని ఎత్తివేయాలని  ప్రజల హక్కుల  కోసం మాట్లాడే వారి పైన  ప్రభుత్వం, పోలీసుల నిర్బంధం ఆపాలని హ్యూమన్  రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాకినీడి మణికంఠ స్వామి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ  భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (1) లో ప్రతి పౌరునికి మాట్లాడే హక్కు, భావ ప్రకటన హక్కు ,సభలు, సమావేశాలు సంఘాలు ఏర్పాటు చేసుకునే  హక్కు తోపాటు ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడం , నిరసన తెలపడం భారత రాజ్యాంగం కల్పించిందని అయితే పౌర హక్కులకు భంగం కలిగించే విధంగా (30) చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను,ప్రజాసంఘాలు ,రాజకీయ పార్టీలను పోలీసులు తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని  తెలిపారు.

శాంతిభద్రతల సమస్యలు వచ్చినప్పుడు పోలీసు (30) చట్టం చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంల పొడవునా చట్టాన్ని అమలు చేస్తూ ప్రజల పైన, ప్రజల హక్కుల గురించి మాట్లాడే వారి పైన నిర్బంధం విధిస్తూ అక్రమ అరెస్టులు చేయటం, ముందస్తు అరెస్టులు చేయటం, కేసులు  పెట్టి వేధించడం కార్యాలయాల దగ్గరికి, ఇంటి దగ్గరికి, పనిచేసే చోటు దగ్గరికి వచ్చి నోటీసులు ఇవ్వటం అవమానకరమని మణికంఠ స్వామి తెలిపారు. అలాగే పెగాసెస్‌ను గత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై వేసిన శాసనసభ కమిటీ డేటా చోరీ జరిగిందని అనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని ఈ విషయంలో మరింత సమాచారం సేకరించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సేవామిత్ర యాప్‌ ద్వారా 30 లక్షల మంది ఓటర్లను తొలగింపుకు కారణమైందని నివేదికలో ఎత్తి చూపిన అంశాలు చాలా తీవ్రమైనమని ప్రజాస్వామ్య వ్యవస్థను సవాల్‌ చేసేవి. వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం కల్పించేవి కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించి రాష్ట్ర ప్రజానీకానికి వివరణ ఇవ్వాలని మణికంఠ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సేవా మిత్ర యాప్‌ ద్వారా తమకు ఓటు వేయని 30 లక్షల మంది వివరాలు సేకరించి వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించారన్న అభియోగం చాలా తీవ్రమైనది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేది. ఎన్నికల సంఘానికి తెలియకుండా ఇది ఎలా జరుగుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. లేదా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి వ్యవహరిస్తుందా అని అనుమానాలు కూడా కలుగుతాయి. ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఇలాంటి యాప్‌ ల ద్వారా ఓటర్‌ లిస్టుని నియంత్రించేటటువంటి ప్రమాదం ఉందని ఈ నివేదిక వెల్లడి చేస్తుంది.అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇవ్వాలి అని సమగ్ర న్యాయ విచారణ జరిపి దోషులైనవారందరినీ శిక్షించాలని మకినీడి తెలియజేశారు.