మంత్రి నాగార్జున బేషరతుగా ఆంజనేయులుకు క్షమాపణ చెప్పాలి.

 మంత్రి నాగార్జున బేషరతుగా ఆంజనేయులుకు క్షమాపణ చెప్పాలి.

విశాఖ లోకల్ న్యూస్:2022 సెప్టెంబర్ 16

మంత్రి మెరుగు నాగార్జున అసెంబ్లీ సాక్షిగా సహచర దళిత ఎమ్మెల్యే పట్ల అమానుషంగా మాట్లాడడాన్ని విశాఖ జిల్లా టిడిపి పార్లమెంటరీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుడుమూరి గోవింద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. నగరంలో ఎల్ ఐ సి అంబెడ్కర్ విగ్రహం వద్ద విశాఖ జిల్లా టి. డి. పి పార్లమెంటరీ ఎస్.సి సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా గోవిందా రావు  మాట్లాడుతూ టిడిపి ఎమ్మెల్యే ఆంజనేయులు పట్ల మంత్రి నాగార్జున చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ సహచర దళితుడి పట్ల ఆ గౌరవంగా మాట్లాడడానికి మంత్రి నాగార్జునకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. 

అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చని అన్నారు. తక్షణమే మంత్రి నాగార్జున బే షరతుగా ఆంజనేయులు క్షమాపణ చెప్పాలని పుచ్చా విజయ్ కుమార్,బుడుమూరి  గోవింద్ లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి సెల్ ప్రధానకార్యదర్శి పొడుగు కుమార్,ప్రధాన కార్యదర్శి జయరాజ్,ఉత్తర నియోజకవర్గ ఎస్.సి సెల్ అధ్యక్షులు ఆదినారాయణ,47 వ వార్డ్ ఎస్ సి సెల్ అధ్యక్షులు మోర్తా రాజారావు,చిన్న,ప్రసాద్, అప్పలరాజు,చంటి తదితర నాయకులు పాల్గొన్నారు.