లోన్ యాప్స్ దానియొక్క దుస్పరిణామాలు" పై రసజ్ఞ సాంస్కృతిక వీధి నాటిక

 లోన్ యాప్స్ దానియొక్క దుస్పరిణామాలు" పై రసజ్ఞ సాంస్కృతిక  వీధి నాటిక

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్ 16

ఇటీవల కాలంలో సైబర్ ఆర్ధిక నేరగాళ్ల ముసుగులో పడి ప్రజలు తమ ఆస్తులను జీవితాళను కోల్పోతున్న సంఘటనలు వలన ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాలని, రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అవగాహన తో ఉండాలని విశాఖ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ఉత్తర్వుల మేరకు శుక్రవారం సాయంత్రం  మధురవాడ పరిసల ప్రాంతాల్లో వాంబేకాలనీ  మరికావలస,కె1,కె2,కె3,కొలని మరియు సేవ నగర్ లో  రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ ప్రదర్శిస్తున్న వీధి నాటిక" లో భాగంగా లోన్ యాప్స్ దానియొక్క దుస్పరిణామాలు" గురించి నార్త్ సబ్ డివిజన్ పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ సి.ఐ. యెన్ని. రామకృష్ణ   ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు...


 ఈ సందర్భంగా ప్రజలకు వీధి నాటిక"ను ప్రదర్శించి ఎవరైన సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేయండి నేరం జరిగిన వెంటనే రిపోర్టు చేస్తే మీ డబ్బుని తిరిగి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్ని పీఎం.పాలెం పోలీస్ స్టేషన్ సి.ఐ రామకృష్ణ తెలిపారు..