కొర్రాయి గోవిందరావు జ్ఞాపకార్థం పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేసిన కొర్రాయి బ్రదర్స్
మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్ 2022 కస్టమర్ 16
మధురవాడ లో కొర్రాయి గోవిందరావు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని కొర్రాయి బ్రదర్స్ (మంగరాజు, అప్పలస్వామి, సురేష్) అన్నారు. కొర్రాయి గోవిందరావుద్వితీయ వర్థంతిని పురస్కరించుకొని మధురవాడ 5వ వార్డు శివశక్తి నగర్ లో శుక్రవారం గోవిందరావు చిత్రపటానికి ఘన కొర్రాయి బ్రదర్స్ మరియ తదితరులు నివాళులు అర్పించారు.
అనంతరం పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు పంచిపెట్టారు. ఈ సంద్భంగా కొర్రాయి బ్రదర్స్ మాట్లాడుతూ అన్నయ్య భౌతికంగా మాతో లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ మా వెంట ఉంటా యన్నారు. ఆయన ఎప్పుడూ మా అన్నదమ్ములకు మార్గదర్శకమన్నారు. ఆయన నిరంతరం మా యోగక్షేమాల గురించి ఆలోచించేవాడని, అలాంటి వ్యక్తి మా నుంచి దూరం కావడం ఎప్పటికీ తీరని లోటు అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. అనంతరం గోవిందరావు జ్ఞాపకార్థం అనాథ ఆశ్రమంలో సుమారు 500 మందికి భోజనం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కొర్రాయి అప్పారావు, బొట్ట రామసత్యం, ఇయ్యపు నాయుడు, నమ్మి రమణ, నమ్మి అప్పలస్వామి, కరణం సుబ్రమణ్యం, భాస్కర్‌యాదవ్, కిషోర్, బమ్మిడి సూరిబాబు, శ్రీను, నమ్మి వాసు, బొట్ట ఆనంద్, ముగడ సునీల్, బొట్ట పెంటయ్య, నమ్మి గోపి తదితరులు పాల్గొన్నారు.
