కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయిస్తూ జీవో ఇవ్వాలి మధురవాడలో పోస్టర్ ఆవిష్కరణ
మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్ 16
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి జరుగుతున్నాయి ఈ సమావేశాలలో షెడ్యూల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు,వివిధ ప్రభుత్వ స్కీమ్స్ లో పనిచేస్తున్న వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు తక్కువ లేకుండా నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ మధురవాడ సిఐటియు ఆఫీసులో పోస్ట్ ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు మధురవాడ జోన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.రాజ్ కుమార్, డి. అప్పలరాజు, సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్వీ కుమార్, విజయ్,పైడిరాజు చిన్నా పాల్గొని ఈ సందర్భంగా రాజ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకి ఒకసారి కార్మికులకు అప్పటి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ కనీస వేతనాల జీవోని సవ రించాలి కానీ గత 15 సంవత్స రాల నుండి కనీస వేతనాల జీవోను సవరించలేదు దీనివలన కార్మికులు అతి తక్కువ వేత నాలతో కేవలం పది నుంచి 12 వేల రూపాయలుకు పని చేయ వలసి వస్తుంది 2006 లో కనీస వేతన జీవోలు ఇచ్చారు తిరిగి 2011, 2016, 2021 సంవత్సరాల లో పెరిగిన ధరలు కనుగునంగా కనీస వేతనాలను పెంచాల్సి ఉంది కానీ అప్పుడు అధికారులు ఉన్నటు వంటి కాంగ్రెస్,తెలుగు దేశం,వైసీపీ ప్రభుత్వాలు కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరి స్తున్నాయి ప్రజా ప్రతినిధులకు మాత్రం జీతాలను విపరీతంగా పెంచుకుంటున్నారు .సంపదను సృష్టిస్తున్న కార్మిక వర్గానికి జీతాలు పెంచడం లేదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీస వేతన సలహా మండలని నియమించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెరిగిన ధరలు కనుగొనంగా కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ఈనెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద భారీ ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి దాని లో భాగంగానే మన విశాఖ జిల్లాలో సరస్వతీ పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన మరియు ధర్నా జరుగుతుంది.
ఈ ధర్నాలో విశాఖ జిల్లాలో పనిచేస్తు న్నటువంటి షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులు,కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులు,వివిధ ప్రభుత్వ స్కీమ్స్ లో పనిచేస్తు న్నటువంటి స్కీం వర్కర్లు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి మన డిమాండ్ ను తెలియజే యాల్సిందిగా కోరుతున్నాం.

