కామ్రేడ్ పోతిన సన్యాసిరావు చిరస్మరణీయడు

       కామ్రేడ్ పోతిన సన్యాసిరావు చిరస్మరణీయడు

38 వ వర్ధంతి లో క్వారీ అఖిల పక్ష నాయకులు నివాళులు

మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్ 16 

సిపిఐ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు కామ్రేడ్ పోతిన సన్యాసిరావు 38 వ వర్ధంతి సందర్బంగా మధురవాడ సిపిఐ కార్యాలయం వద్ద ఉన్న సన్యాసిరావు విగ్రహానికి స్థానిక క్వారీ సొసైటీ సిపిఐ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈసందర్భంగా పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూసన్యాసిరావు రెండు సార్లు శాసనసభ్యుడుగా పనిచేశారని మధురవాడ ప్రాంతంలో విద్య, వైద్యం ,రహదారులు , మొదలైన మౌలిక సదుపాయాలు కల్పన కోసం విశేషంగా కృషి చేశారని చెప్పారు. మధురవాడ క్వారీ సొసైటీ నిర్మించి వండలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని, ఉన్నత పాఠశాల మధురవాడలో ఉండాలని అందరినీ కలుపుకొని ఏర్పాటు చేశారని విభజన ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద పాఠశాలగా రూపొందిందని ఇటువంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేశారని అందువలననే మరణించి 38 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్మరణీయడుగా ఉన్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, క్వారీ అధ్యక్షులు పి అప్పన్న, కార్యదర్శి వి రవికుమార్, పూర్వ అధ్యక్షులు పి రాంబాబు అఖిలపక్ష నాయకులు చెన్నా దాసు, కె రామారావు పి కృష్ణమూర్తి పాత్రుడు, పి సత్యనారాయణ, నాగరాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పి సుజాత, వాండ్రాసి అప్పలరాజు, పి రాంబాబు, పి సూరిబాబు, వి సత్యనారాయణ సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ క్వారీ పాలకవర్గ సభ్యులు సన్యాసిరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.