కళింఘవైశ్య & బేరివైశ్యా ల సమస్యలపై నిరంతరం కృషి చేస్తా:అందవరపు సూరిబాబు

 కళింఘవైశ్య & బేరివైశ్యా ల  సమస్యలపై నిరంతరం కృషి చేస్తా:అందవరపు సూరిబాబు

భీమిలి:విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్ 18

ఆంధ్రప్రదేశ్ లో కళింఘవైశ్య & బేరివైశ్యా ల  సమస్యలపై నిరంతరం కృషి చేస్తానాని తెలిపిన అందవరపు సూరిబాబు

వివరాలు;భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసీ జోన్ టు పరిధిలోని  బోయపాలెంలో జె. ఎన్. యూ.ఆర్.ఎం  {జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్} కొలనిలో సకల భక్తుల శ్రీనివాసరావు ఆద్వర్యములో ఆదివారం నాడు  *"టీ విత్ చైర్మన్"* అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్   చైర్మన్ అందవరపు సూరిబాబు..  మాటాడుతూ జె. ఎన్. యూ.ఆర్.ఎం కొలనిలో నివసిస్తున్న సుమారు 20  కళింగ వైశ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆ సంఘం యొక్క బాగోగులు అడిగి తెలుసుకుని పలు సమస్యలపై చర్చించారు . తదుపరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు ఎవరైనా అర్హులు అయ్యి ఉండి అందకపోతే మాకు తెలియపరచాలని, అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తామని సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని సూరిబాబు తెలిపారు.


ఈ సందర్భంగా పలు సమస్యలపై చైర్మన్ సూరిబాబుకి సంఘంసభ్యులు వినతిపత్రం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు లాడి కిషోర్ , అక్కయ్యపాలెం సంఘ నాయకులు కళ్లివరపు దలిరాజు, మారికవలస కళింగ సంఘం సెక్రటరీ కోరాడ లక్ష్మణరావు, మధురవాడ కళింగ వైశ్య సంఘం సెక్రటరీ పొట్నూరు గణేష్ నారాయణ శెట్టి చక్రపాణి బోయపాలెం కళింగ వైశ్య కుటుంబీకులు పాల్గొన్నారు