బుడిమూరి గోవింద్ చేతుల మీదుగా మహా అన్నదానం
విశాఖ తూర్పు:విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్ 18
విశాఖ తూర్పునియోజకవర్గం జీవీఎంసీ 9 వ వార్డు హనుమంతువాక, క్రాంతి నగర్ లో వినాయకచవితి ఉత్సవాలలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మహా అన్నదానం కార్యక్రమం స్థానిక సంగమ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగినది. మహా అన్నదానం కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా తెలుగుదేశం పార్టీ 9 వ వార్డు ఇంచార్జ్ మరియు విశాఖ పార్లమెంట్ ఎస్. సి సెల్ అధ్యక్షులు బుడిమూరి గోవింద్ ని ఆహ్వాంచడం జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసి అన్నదనానికి వచ్చినా భక్తులకు స్వామి వారి అన్న ప్రసాదాన్ని వడ్డన చేసారు.
ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ తూర్పునియోజకవర్గం ఐటీడీపి ఇంచార్జ్ బాదరు బాలరాజు, విగ్రహ దాత అందిబోయిన నాగరాజు,9 వ వార్డు మహిళా ప్రధాన కార్యదర్శి భారతి, గ్రామ పెద్దలు ఆదినారాయణ, పులి వెంకటరమణ, గురుమూర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

