నిరుద్యోగ యువతను మోసం చేస్తే జనసేన పార్టీ తరపున పోరాటం తప్పదు: డాక్టర్ సందీప్ పంచకర్ల
భీమిలి:అసలే జాబ్ క్యాలెండర్ లేక, డి ఎస్ సి నోటిఫికెషన్స్ లేక, ఉద్యోగాలు లేక బాధపడుతున్న యువతకు వైసీపీ పార్టీ వారు నిర్వహించిన జాబ్ మేళ ఒక బోగస్ మేళా అని ఋజువుఅయ్యింది.
ఈ ఏడాది మార్చిలో జరిగిన జాబ్ మేళాలో మీ పార్టీ నాయకులకు సంబందించిన "వీ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్" కంపెనీ కొందరు యువతను ఉద్యోగాల్లోకి తీసుకుని ట్రైనింగ్ పేరిట పెద్దమొత్తంలో వారి దగ్గర నుండి సొమ్ములు వసూలు చేసి, పని చేయించుకుని వారికి జీతం ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది.
అసలు ఉద్యోగ కల్పన చేతకాని వైసీపీ వాళ్లకు ఈ కంపెనీలు, బోగస్ జాబ్ మేళాలు తోడు అయ్యి యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండ ఉన్న ఈ కంపెనీ యాజమాన్యం సరిగ్గా స్పందించి బాధితులకు వెంటనే న్యాయం చెయ్యకపోతే బాధితుల తరపున జనసేన పార్టీగా మేము పోరాటం చేయాల్సి ఉంటుంది.
వారి దగ్గర నుండి తీసుకున్న సొమ్ము, మరియు వారి జీతాలు వారంలోగా చెల్లించాలి లేదంటే మా కార్యాచరణ రూపొందిస్తాం.

