గంటా శ్రీనివాసరావు కు అమ్మవారి నవరాత్రుల మహోత్సవంనకు ఆహ్వానం...
విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్ 18
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కు విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు మాధవధార లో కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించే కనకదుర్గ అమ్మవారి నవరాత్రుల మహోత్సవం కు ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల. విజయ్ బాబు , మాజీ కార్పొరేటర్ సనపల రామాంజనేయులు కుమారుడు సనపల కీర్తి, జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్, 51వ వార్డు సెక్రటరీ మదు, బి సి సెల్ ప్రెసిడెంట్ రాజు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

