టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం
విశాఖ ఉత్తర:వి న్యూస్
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల. విజయ్ బాబు ఆధ్వర్యంలో 50వ వార్డు బిర్లా జంక్షన్ వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డు ప్రెసిడెంట్ సనపల వరప్రసాద్ అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

