మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభం.
మధురవాడ 7 వ వార్డు ద్రోనం రాజు కళ్యాణ మంటపం వద్ద మున్సిపల్ కార్మికులు సమ్మె లో భాగంగా సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.తెల్లవారేసరికి వార్డు కార్యాలయం కు చేరుకున్నారు.గేటు బైటాయించి నినాదాలు చేశారు.పి ఎం పాలెం స్టేషన్ పోలీసులు చేరుకుని,కార్మికులను చెళ్ళా చెదురు చేసీ చెత్త సేకరణ వాహనాలను తరలించాలని ప్రయత్నం చేశారు. కార్మికులు కదలకుండా గేటు వద్ద ఆందోళన చెయ్యడంతో వాహనాలు తీయలేక పోయారు.జోనల్ కమిషనర్ బీ రాము చేరుకుని కార్మికులతో వాగ్వి వాదానికి దిగారు.బెదిరించాడని చూసారు.కార్మికులు కదలకపోయేసరికి వెనుతిరిగారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా వ్యాహరించకుండ కార్మిక సంఘాలు తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేస్తే సమ్మె.విమిస్తామని తెలియ జేశారు.ఈ.కార్యక్రమంలో సీఐటీయూ జోన్ కార్యదర్శి పీ రాజు కుమార్,నాయకులు ఎస్ రామాప్పడు, కే రాజు,బి రాంబాబు, ఎన్ రమణమ్మ,ఎస్ లక్ష్మణా,యు లక్ష్మి,సుజాత,ఎస్ శ్రీను తదతరులు పాల్గొన్నారు.

