భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
ధరల పెంపుదలను నియంత్రించాలి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్
ఆనందపురం: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల ధరలు పెంపు శిరోభారంగా మారిందని టిడిపి యువ నాయకుడు, వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం వేసిందన్నారు.ఇక రాష్ట్రప్రభుత్వం విషయానికొస్తే ఆర్టీసీ చార్జీలు, ఆస్తి, ఇంటి, చెత్త పన్నులు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ప్రజారంజక పాలన అందిస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వాలు మాట మార్చి వారి స్వార్ధ ప్రయోజనాలకు చూసుకోవడం సబబు కాదని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోరుకునేవారు అయితే తక్షణమే ధరల పెంపుదలను నియంత్రించాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు.

