రెండో రోజు కొనసాగించిన మున్సిపల్ కార్మికుల సమ్మె..
మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె రెండో రోజు సందర్భంగా 7 వ వార్డు మార్కెట్ ప్రాంతంలో,ధ్రోనం రాజు కాల్యణ మండపం వద్ద,నగరం పాలెం రోడ్డులో కార్మికులు ఆందోళనలు చేశారు.
చెత్త సేకరణ వాహనాలను,కంపార్ట్ బిన్ వాహనాలను నిలిపి వేశారు.మార్కెట్ వద్ద కంటైనర్ తీసుకు వెళ్ళే వాహనాన్ని నిలిపి వేశారు.వాహనాలు వెనక్కి పంపించారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మొండిగా వ్యవహరిస్తే ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని తెలియజేశారు.ప్రజలకు అసౌకర్యం కలుగకుండా,వ్యాధులు ప్రబల కుండా చూడ వలసిన బాధ్యత ప్రభుత్వం పై వుందని,కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ అన్నారు.కార్మికులకు ఇస్తున్న వేతనాలు తగ్గించడం విడ్డూరంగా ఉందని అన్నారు.కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇస్తు ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ రామప్ప డు,బి రాంబాబు,యు లక్ష్మి,నారసియ్యామ్మ,సుజాత, కే రాజు తదితరులు పాల్గొన్నారు.

