అమరావతి నగర్ కాలనీ వాసుల మంచినీటి సమస్యను పరష్కరించండి.
కొమ్మాది :అమరావతి నగర్ :విశాఖ లోకల్ న్యూస్ :
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 6 వ వార్డ్ ,కొమ్మధి విలేజ్ దగ్గర ఉన్న అమరావతి నగర్ దగ్గర నివాసముంటున్న గృహలకు జీవీఎంసీ మున్సిపల్ నీటి లైన్ లను ఇచ్చారు కానీ రెండు, మూడవ అంతస్థు లోకి నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఇబ్బందిని గమనించి మాకు మంచినీరు వచ్చేటట్టుగా చేస్తారని కోరుకుంటున్నాం అని ఇక్కడ ప్రజలందరూ కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కింద వరకు మాత్రమే నీళ్లు వస్తున్నాయి మిగతా రెండు అంతస్థు లకు నీళ్లు రాకపోవడం వల్ల ఇళ్లల్లో ఉండే సదుపాయం లేక వాళ్ళు సొంత ఇంట్లో ఉండకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నామని చెప్తున్నారు. నీళ్లు ఇచ్చినట్లయితే వాళ్లందరూ కూడా వచ్చి తమ సొంత ఇల్లు నివసించే అవకాశం ఉన్నది కావున మీరు సహకరించి మాకు మంచినీరు ట్యాంకులు పాడైపోయినవి మూడవ అంతస్థు లో నీటి ట్యాంక్ లు కూడా బాగు చేయించి నీరు నిలుపుకునే సదుపాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాం అని అమరావతి కాలనీ లో నివసిస్తున్న శ్రీనివాస్ రెడ్డి మీడియాతో వారి బాధలను తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ నెంబర్ 9 నివాసముంటున్న ప్రజలు పాల్గొన్నారు.


