భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
సత్యనారాయణస్వామి వారిని దర్శించుకున్న వైసీపీ నాయకులు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారిని దర్శించుకున్న విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ నాయకులు మాజీ గ్రంధాలయ చైర్మన్ బంటుబల్లి మణిశంకర్ నాయుడు మరియు విశాఖపట్నం జిల్లా పశుగణాభివృద్ది సంగం చైర్మన్ మరియు భీమునిపట్నం జడ్పీటీసీ సభ్యులు గాడు వెంకటప్పుడు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు అధికారులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందించారు.అనంతరం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ వద్ద జరుగుతున్న వైఎస్సార్ సీపీ ప్లీనరీలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గాడు తాతినాయుడు, నీలాపు సూర్యనారాయణ పాల్గొన్నారు.

