భీమిలి:విశాఖ లోకల్ న్యూస్:
పాండ్రంకి గ్రామ ప్రాంతం వద్ద గొస్తని నది పై బ్రిడ్జి నిర్మాణం తక్షణమే పనులు చేపట్టాలి: పంచకర్ల సందీప్
బ్రిటిష్ సామ్రాజ్యన్ని హడలుగొట్టిన మన్యం వీరుడు, స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, అల్లూరి సీతారమరాజు 125 వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారు జన్మించిన పాండ్రంకి గ్రామ ప్రాంతం వద్ద గొస్తని నది పై బ్రిడ్జి నిర్మాణం కొరకు సుమారు 18 నెలలు క్రిందట 14 కోట్లు మంజూరు అయినప్పటికీ ఇప్పుటికీ పనులు ప్రారంభం కాని కారణంగా తక్షణమే వంతెన నిర్మాణం ప్రారంభించి అక్కడి ప్రాంతవాసుల ప్రాణాలు కాపాడే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని సోమవారం భీమిలి ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నది పొంగి గతంలో అనేకమంది పిల్లలు, యువకులు చనిపోవడం జరిగింది. ఈ దీక్షకు జనసేన నాయకులు,జనసైనికులు, వీరామహిళలు మరియు అక్కడి ప్రాంత వాస్తవ్యులు మద్దతు ప్రకటించడం జరిగింది.

