భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంకి లో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలు


 భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంకి లో అల్లూరి సీతారామరాజు  125 వ జయంతి వేడుకలు.

భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

విప్లవ కారుడు అయిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు ఆయన స్వగ్రామం అయిన పాండ్రంకి లో 125 అడుగుల పోడవైన జాతీయ జెండా చేతపట్టి విద్యార్థులు భారీ ర్యాలీ తో  ఘనంగా నిర్వహించడం జరిగింది 

కార్యక్రమం లో బాగంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ,విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు ,వి ఎమ్ ఆర్ డి ఏ చైర్మన్ .అక్కరమాని విజయ నిర్మల,యంయల్సి వరుదు కళ్యాణి,మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోలా గురువులు అల్లూరి విగ్రహం కి పూల మాలలు వేసి సుమాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం వందేమాతరం గేయం ఆలపించి  విద్యార్దినులు సాంప్రదాయం నృత్యాలు,అల్లూరి వారి వేషధారణతో ఆయన జీవితం చరిత రఘు దారావాహిక పాటు నృత్య రూపంలో వేయడం జరిగింది 

అనంతరం ముఖ్య అతిథులు అల్లూరి సీతారామరాజు  జీవిత చరిత్ర కోసం తమ తమ సందేశాలు వినిపించారు

అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాదారణంగా అసమాన నాయకుడు తన వర్గం కోసం తను పుట్టిన ప్రాంతం కోసం పోరాడుతారు పాటు పడతారు కానీ అల్లూరి సీతారామరాజు అసమానులు భారతదేశం కి స్వాతంత్ర్యం తెచ్చిన అసమాన  వీరులలో  అల్లూరి సీతారామరాజు  ఒకరిని,ఆయన గాయకులు విల్లు విద్యా కారులు,రచనలు సాహిత్యం ఇలా పలు కళలు కలిగిన వారు అని,ఈయన బ్రతికింది 27 సం. రాలే అయిన ప్రజలు గుండేల్లో ఇప్పటికి జీవించే ఉన్నారని,ఇంతటి వీరుడు మన ప్రాంతంలో జన్మించడం మనందరికి గర్వకారణం అలాంటి వీరుని పేరు ఒక జిల్లా కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పెట్టడం చాలా సంతోషంగా ఉందని మన్యం ప్రాంతంలో 75 కోట్లు తో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది అదే రీతిలో పాండ్రంకి లో కూడా మ్యూజియం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని మాట్లాడారు అనంతరం ఆయన పాండ్రంకి బ్రిడ్జి నిర్మాణం విషయంలో నిదులు కోసం సియం దృష్టిలో పెట్టగా ఆయన 14 కోట్లు రూ. మంజూరు చేయడం జరిగింది కరోనా సమయంలో టెండర్ లకు పిలిచినా ఎవరూ రాలేదని త్వరితగతిన నెలరోజుల్లో నిర్మాణం పనులు ప్రారంభించాలని ఖరాఖండిగా సంబంధిత అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు.మండలం లో అర్హత కలిగిన విద్యార్థులు కు అమ్మ ఒడి 27 కోట్ల 5 లక్షల 25 వేల రూపాయలు చెక్కు విద్యార్థుల తల్లులకు అందివ్వడం చేసారు.ఆనంతరం విప్లవ వీరుడు అల్లూరి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఒక్క వీరుడు సినిమా పోష్టర్ ఆవిష్కరణ చేసి ముఖ్య అతిథులకు అల్లూరి చిత్ర పటాలు బహుకరించారు.నాడు నేడు లో భాగమైన అదనపు తరగతి గదులు  నిర్మాణం కి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన  చేసారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం చేసారు అనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు

 ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు వి ఎమ్ ఆర్ డి ఏ చైర్మన్ అక్కరమాని విజయ నిర్మల , యంయల్సి వరుదు కళ్యాణి , మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోలా గురువులు ,జీవియంసి విప్ అక్కరమాని రోహిణి  కార్పోరేటర్ లు, వార్డు ఇంచార్జ్ లు ,మూడు మండలాల యంపిపి లు వైస్ యంపిపి లు, జెడ్పిటీసి లు యంపిటిసిలు సర్పంచ్ లు వివిధ కార్పోరేషన్ చైర్మన్ లు డైరెక్టర్ లు మార్కేటింగ్ చైర్మన్ లు, డైరెక్టర్ లు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.