విశాఖ లోకల్ న్యూస్:
జనసేన సైనికులకు సంఘీభావం తెలిపిన కోరాడ రాజబాబు.
అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా భీమిలి నియోజకవర్గం జనసేన నాయకులు నివాళులర్పించగా పాండ్రంకి బ్రిడ్జి గురించి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ని అడగగా జనసేన నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు . వెంటనే భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ కుమార్ మరియు జనసేన నాయకులు అక్కడే దీక్షకు దిగారు. వాళ్లకి సంఘీభావం తెలిపిన భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు మరియు మాజీ మంత్రివర్యులు ఆర్ ఎస్ డి పి అప్పల నరసింహ రాజు వారితోపాటు భీమిలి నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు...

