పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి


   పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ     మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా  స్వాతంత్ర నగర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగోతి. సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇందులో భాగంగా పౌర సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మరియు గౌరవ అధ్యక్షులు అయిన మల్లువలస జగదీశ్వర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి పౌరసంక్షేమ సంఘం సభ్యులు అందరూ ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ సంఘము స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన నిర్వహించిన కార్యక్రమాలు అన్నియు గుర్తు చేసుకోవడం జరిగినది. 

ఈ సందర్భంగా పలువురు అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడుతూ  స్వాతంత్ర సాధనలో ప్రజలను చైతన్య పరిచి స్వాతంత్ర సాధనకు నాంది పలికారని వక్తలు అభిప్రాయపడ్డారు, మన దేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ వారిని ఎదురొండి పోరాడి గడ గడ లాడించిన మహా యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు, 

ఈ కార్యక్రమంలో  బి.పాపారావు, నుకవరపు బజ్జి, డికి.శ్రీను, వి.శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, మామిడి.వరాలక్మి, ఆశ జ్యోతి,పి.అప్పన్న, డి.ఆర్.రమేష్, కరీం, ఆశా స్వరూప్ తదితరులు నివాళులు అర్పించరూ.