వంగవీటి మోహన్ రంగా అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు


 మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

వంగవీటి మోహన్  రంగా  అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

క్రీస్తు శేషులు వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా మధురవాడ లో  రంగా  అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి వంగవీటి మేఘనాథ్  ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు .అనంతరం మధురవాడ మరియు చుట్టుపక్కల గ్రామాల రంగా  అభిమానులు భారీగా తరలి వచ్చి వంగవీటి మోహన్ రంగా  మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మధురవాడ పరిష్రాల్లో ఉన్న సన్ఫ్లవర్ దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ మరియు ద్రోణం రాజు కళ్యాణ్ మండపం దగ్గర గల వైజాగ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా వంగవీటి మేఘనాథ్ తో పాటు ఈఎన్ఎస్ చంద్రరావు, అద్దంకి సాంబ.శివరావు, జీకే శ్రీకాంత్, దుర్గ భవాని, భావన నిర్మాణ శ్రామిక సంఘం అధ్యక్షులు వైయస్ మూర్తి బలరాం, నారపు రెడ్డి ,సాయి తారక్, సూర్య ,మానం శీను ,బొల్లు కృష్ణారావు హరికృష్ణ రంగా అభిమానులు పాల్గొన్నారు....