విశాఖ నగరంలో రేషను డిపోల ద్వారా 5కిలోల వంట గ్యాస్ సిలిండర్లు.
విశాఖపట్నం :విశాఖ లోకల్ న్యూస్.
విశాఖ నగరంలో రేషను డిపోల ద్వారా 5కిలోల వంట గ్యాస్ సిలిండర్లు నేటి నుంచి (సోమవారం) విక్రయించేందుకు రంగం సిద్ధమవుతోంది.జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రారంభించనున్నది.ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (ఎఫ్‌టిఎల్) కింద సరఫరా చేసే 5 కిలోల సిలిండర్ ఖరీదు రూ.587గా నిర్ణయించారు. ఈ ధర ప్రతి నెల మారే అవకాశం ఉంది. గ్యాస్ పొయ్యి ఖరీదు రూ.600 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. డిపాజిట్ కింద రూ.1150 చెల్లించాలి. రెగ్యులేటర్ ఉచితంగా ఇస్తారు. ఈ మొత్తం కనెక్షన్ వద్దనకుంటే తిరిగి చెల్లిస్తారు. దీన్ని వాణిజ్య అవసరాలకూ వినియోగించుకోవచ్చు.

