జనసేన నాయకుడు యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125 వ జన్మదిన వేడుకలు

జనసేన నాయకుడు యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125 వ జన్మదిన వేడుకలు.

విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ 

 విప్లవ వీరుడు అల్లూరి సితారామరాజు గా125 వ జయంతి సందర్బంగా అల్లూరి సితారామరాజు నగర్ లో వున్నా అల్లూరి విగ్రహం కి పువ్వాలమాలలు వేసి నివాళి అర్పించారు.యడ్ల గణేష్ యాదవ్ మాట్లాడుతూ సూరీడు ఎలా ఉంటాడో చూడాలనిపిస్తే ఆ విప్లవ మూర్తిని చూపించాలి. తెల్లవారి గుండెల్లో అగ్నిపర్వతంలా పేలిన తెలుగు బిడ్డ..మన్యం ప్రజల గుండె చప్పుడు అల్లూరి సీతారామరాజు అని భీమిలి పాండ్రంగి లో అల్లూరి సీతారామరాజు పుట్టడం మన భీమిలి నియోజకవర్గం ప్రజలు కి ఎంతో గర్వకారణం అని అన్నారు,ఈ ప్రాతం లో కడుతున్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం కి అల్లూరి సీతారామారాజు  పేరు పెట్టాలి అని జనసేన తరుపున కోరుతున్నాము అని యడ్ల గణేష్ యాదవ్ తెలియజేసారు. 6వార్డు జనసేన నాయకుడు సంతోష్ నాయుడు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు  స్ఫూర్తి తో యువత అంత నడుస్తూ మంచి మంచి కార్యక్రమలు చేస్తున్నారు అని తన సొంత నిధులు తో విగ్రహం మరమ్మతులు చేయించిన యువత కు అభినందనలు తెలియజేసారు.జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం మహిళా నాయకురాలు ఒమ్మి దేవి యాదవ్  మాట్లాడుతూ అల్లూరి  స్ఫూర్తి తో అందరూ ముందుకు సాగాలి అని కోరారు,ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు కుబీరెడ్డి ప్రసాద్ , విజయ్ కుమార్ , స్థానిక జనసేన యువత దిలీప్, వెంకట సాయి, సాయి వర్మ, సునాద్, శ్యామ్, జేమ్స్, గణేష్ విక్కీ, గణేష్, తదితరులు పాల్గొన్నారు