ఘనంగా ఉద్యమ వీరుల జన్మదిన వేడుకలు.
విశాఖ లోకల్ న్యూస్ :ఆనందపురం.
ఆనందపురం : తెలుగునాడు విద్యార్థి సమైక్య భీమిలి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోరాడ వైకుంఠ రావు ఆధ్వర్యంలో ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొండవీటి మోహన్ రంగా జన్మదిన వేడుకలను నీళ్లకుండీలు జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ మాట్లాడుతూ అడవి నుండి ఆకాశానికి ఎదిగిన విప్లవ కెరటం అల్లూరి సీతారామరాజు గారు అని కొనియాడారు. నెత్తురు మండే యువతకు ఆరాద్యుడు, మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు, బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలగొట్టిన వీరుడు అల్లూరి అని, ఇలాంటి ఉద్యమ వీరుడు మన జిల్లాలోనే పుట్టడం మనకు గర్వకారణం అని తెలిపారు. నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోరాడ వైకుంఠ రావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారు ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదు అని ఆయన ప్రజా నాయకుడు అని అన్నారు. గుండాల అరాచకాలకు ఎదురొడ్డి బీద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం కులాలకు అతీతంగా పోరాడిన ఉద్యమ వీరుడు వంగవీటి మోహన్ రంగా గారు అని తెలిపారు. అనంతరం చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు షినగం చంటి, బాలి సాయి, షినగం గోవింద్, కాప్స్ రాక్స్ సభ్యులు బూర్లు శ్రీను, ఏనుగుల సంతోష్, షినగం దినేష్ తదితరులు పాల్గొన్నారు.

