మధురవాడ బ్రిడ్జి సమీపంలో వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించండి.

మధురవాడ బ్రిడ్జి సమీపంలో వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించండి

పాదచారుల వంతెన నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం అంటున్న చంద్రంపాలెం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు.


జీవీఎంసీ జోన్ 2 మధురవాడ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయించే కొండపోతుగా కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాలో డ్రైనేజీ వాటర్ ఇళ్లల్లోకి, రోడ్ల మీదకి రావడంతో పాదాచారులు, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధురవాడ బ్రిడ్జి సమీపంలో వర్షం పడినప్పుడల్లా అక్కడ ఉండే కాలువ నీరు పొంగిపోయి రోడ్ల మీదకు రావడంతో వాహనాలు నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు కూడా గురవుతున్నారు వాహనదారులు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న స్కూలు నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఆ మురికి నీరు నుంచి రావడానికి  చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ వర్షపు నీరు  పడటం వల్ల నగరంపాలెం, గాంధీనగర్ , కొన్ని ప్రాంతాల్లో లోతట్టుగా ఉన్న కాలనీలో డ్రైనేజీ వాటర్ ఇళ్లల్లోకి వచ్చేయడం కూడా జరుగుతుందని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని స్థానికులు తెలుపుతున్నారు... ఇప్పటికైనా అధికారులు వర్షాకాలంలో డ్రైనేజీ వాటర్ రోడ్డు మీదకి రాకుండా ఉండడానికి తగు చర్యలు చేపడతారని వాహనదారులు, విద్యార్థులు ,పాదచారులు కోరుకుంటున్నారు..