తెలుగుదేశం పార్టీ ఆణిముత్యం మొకర నారాయణరావు...! కార్యదర్శి గంటా నూకరాజు*

భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

తెలుగుదేశం పార్టీ ఆణిముత్యం మొకర నారాయణరావు...!  కార్యదర్శి గంటా నూకరాజు* 

రాజకీయాలకే వన్నెతెచ్చిన మహో న్నత వ్యక్తి  మొకర నారాయణరావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు తెలుగుదేశం పార్టీ  కురు వృద్దులు స్వర్గీయ మొకర నారాయణ రావు 10వ వర్ధంతి సందర్బంగా భీమిలి జోన్ 3వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళు లర్పించారు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు,3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ, ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్రకుమార్ లు సంయు క్తంగా భీమిలి  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న స్వర్గీయ మొకర నారాయణరావు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గంటా నూకరాజు మాట్లాడుతూ రాజకీయ చాణక్యుడు మొకర నారాయణరావు అని అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం భీమిలి నుండి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి మొకర నారాయణరావుని అన్నారు అప్పటి నుండి భీమిలిలో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు భీమిలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా,వుడా డైరెక్టర్ గా,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈ విధంగా పార్టీ పరంగా ఎన్నో పదవులు అది రోహించిన రాజకీయ మకుటంలేని మహారాజు మొకర అని అన్నారు ఎంతోమంది యువతకు రాజకీయాల మీద అవగాహన కల్పించి  చైతన్యం కల్పించారని అన్నారు మరణించేటంత వరకు ఒకే పార్టీలో ఉంటూ రాజకీయా లకు వన్నెతెచ్చారని నేడు భీమిలిలో తెలుగుదేశం పార్టీకి ఇంత ఆదరణ,  కార్యకర్తల బలం ఉందంటే నాడు స్వర్గీయ మొకర నారాయణరావు వేసిన బీజమని గంటా నూకరాజు అన్నారు ఇలాంటి రాజకీయ చాణ క్యుడు భీమిలిలో పుట్టడం మన  అదృష్టమని అన్నారు ఈ  కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు  గాడు సన్యాసినాయుడు,కాసరపు నాగరాజు,పెంటపల్లి యోగేశ్వరరావు, మారోజు సంజీవకుమార్,కనకల అప్పలనాయుడు,కె.ఎస్.ఆర్. కృష్ణా రావు,సంకురుబుక్త జోగారావు,అప్పి కొండ నూకరాజు,కొక్కిరి అప్పన్న, గండిబోయిన పోలిరాజు,కంచెర్ల కామేష్,,వియ్యపు పోతురాజు,  నెక్కెళ్ళ వెంకటరావు,సురేందర్,   వాడమొదలు రాంబాబు,మహేష్, పిల్లా తాతారావు,లక్షణరావు,  వాసుపల్లి వంశీ, దౌలపల్లి హరీష్,  దేవుళ్ళు,కందుల సుందర్ రావు, దాసరి రామారావు తదితరులు పాల్గొన్నారు.