రాష్ట్రంలో రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి:పల్లి. మాధవిచార్లెస్
విశాఖ లోకల్ న్యూస్ :
బీజేపీ ఎస్ సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. :పల్లి. మాధవిచార్లెస్ మాట్లాడుతూ మంగళవారం గాజువాకలో రెండేళ్ల చిన్నారి, సోమవారం మతి స్థిమితం లేని ఇద్దరు అడబిడ్డలు, ఇలా.... ఎన్ని రోజులు ? ఎంతమంది ఆడ బిడ్డలు???? అత్యంత దారుణంగా పాల్పడినవాడు దొరికాడు గాని ఆ నీచుడుకి శిక్ష???? యిన్ని ప్రశ్నలు తో అడబిడ్డల మానాలతో ఆడుకుంటున్న ప్రస్తుత యి అధికార రాష్ట్రంలో చట్టాలను అక్రమంగా అమలవుతాయి అంటారు.. రెండేళ్ల చిన్నారి మీద అఘాయిత్యం పాల్పడితే ఎవరు అడ్డుకున్నారు? ఎవరు కాపాడారు? నిజంగా శిక్షలు అమలు అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ అన్నీ యిన్ని జరుగుతాయా.?
ఈ రాష్ట్రంలో ప్రతి నిమిషానికి ఒక అఘాయిత్యం జరుగుతూనే... ఉంది.. రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులు ఇచ్చాము సంవత్సరంలో 50 శాతం పదవులు ఇచ్చాము.. పంచాయతీ లో కూడా 50 శాతం కేటాయించాము... ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంది.. కానీ ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ ఉంది? ఇదే విశాఖ జిల్లాలో గత ఆరు నెలల్లో ఎంత మంది చిన్నారులు మీద దాడి జరిగింది? కనీసం ఒక్క కేసుసు నిలబడిందా? ఒకే ఒక్క వ్యక్తి నైనా శిక్షించారా?.. బిజెపి ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ముందుకు వెళుతోంది.. అన్ని విధాలా పనిచేసే ప్రాంతాల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసింది... చివరికి ఎన్ఎస్జీ కమాండర్ లో కూడా మహిళా దళం ఏర్పాటు చేసింది.. కేంద్ర శిశు సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్ లో ఏర్పాటు చేసి రక్షణ ఇస్తుంది సంరక్షణ చేస్తోంది... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దిశ యాప్ ఎంత మంది డౌన్లోడ్ చేసుకున్నారు? ఎంతమంది దగ్గర ఉందో లెక్కలు వేసుకుంటోంది... యాప్ ఉంటే సరిపోదు దాడులను కాపాడే ఎటువంటి ఆలోచన చేసే దిశ ఉండాలి... చిన్నారుల మీద దాడులు చేసిన వారి మీద ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయాలి వారిని శిక్షించాలి... న్యాయస్థానాలు సైతం వారిని కఠినంగా శిక్షించే విధంగా ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి... నిర్భయ, దిశ, ఇలా పేరు పెట్టుకుని చట్టాలు చేసినా సమాజంలో మార్పు రావడంలేదు... నిందితున్ని వేస్తున్న శిక్షగాని, వారిని మార్పు తెచ్చే విధంగా వ్యవస్థ మారాలి.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలవాలి.. బాధితులు చిన్నారులు కావడంవల్ల తగినంత మానసిక స్థైర్యం ఇవ్వాలి.. వారు జరిగి టువంటి ఇబ్బంది నుంచి బయట పడేలా సమాజం నిలబడాలి... అప్పుడే ఇలాంటి దాడులను మనం ఎదుర్కోగలం సమాజం ఒక నిర్దిష్ట మార్గంలో నడిపించగలం..
యువత గంజాయి, సిగరెట్, మద్యం, ఆఖరికి సన్ మేక్ గమ్ పీల్చి కూడా మత్తుకి గురి అవ్వడం ఆ మత్తులో 2 ఏళ్ల బాలిక నుంచి 70 ఏళ్ల మహిళలు ప్రతీ నిముషం గురి అవుతూనే వున్నారు. కనీసం మద్యం మిగతావి కాదు పబ్లిక్ గా స్మోకింగ్ అపగలిగితే 10% మనం అగాయత్యాలని అరికట్టగలమేమో.
ఈ విషయంలో బాధిత కుటుంబానికి మా పార్టీ తరపున అండగా నిలబడతామని తెలియజేస్తున్నాం. పోలీసులు నిందితుని సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతున్నాం.

