జోన్ 2 మధురవాడ,నగరం పాలెం లో ఆకష్మిక పందులవేట.
మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్ :
జోన్ 2, మధురవాడ, నగరంపాలెం లో బుధవారం తెల్లవారుజామున పందుల వేట ప్రారంభించిన జోన్ 2జీవీఎంసీ సిబ్బంది.జీవీఎంసీ గన్ షూటర్ రాము, వాసు,తెల్లవారు జామున ఆకష్మిక వేట ప్రారంభించి సుమారు 16 నుండి 20పందులను షూట్ చేశామని తెలిపారు. పందులను షూట్ చేసే సమాచారం తెలుసుకున్న పందులను పెంపకం దారులు పందులను షూట్ చేస్తున్న నగరంపాలెం రహదారి ప్రదేశం వద్దకు వచ్చి జీవీఎంసీ సిబ్బందిపై దాడికి దిగారని దాడికి దిగటం తో వేణుదిరగవలసి వచ్చిందని అన్నారు.
పందులపెంపకం దారులు ఒక వర్గం వారికి వాట్సాప్ సందేశం ద్వారా సమాచారాన్ని ఇచ్చారు, మాకు సమాచారం లేకుండా మా పందులను మాత్రమే షూట్ చేస్తున్నారని ఆ వర్గం వారు ఏమైనా ముడుపులు ఇచ్చారా వారికి సమాచారం ఇచ్చారు అని వాగ్ వాదానికి దిగారని జీవీఎంసీ సిబ్బంది వెణుడిరుగుతుండగా పందులు పెంపకందారులు ద్విచక్రవాహనదారులు వారిని వెంబడించారని స్థానికులు తెలిపారు. జీవీఎంసీ సిబ్బంది ఇద్దరు మాత్రమే రావటం పందులు పెంపకం దారులు పదుల సంఖ్యలో వారిపైకి దాడికి రావటంతో చేసేదేమిలేక భయం వేణుదిరిగారన్నారు. జీవీఎంసీ వారి విధులు నిర్వహిస్తున్నవారికి రక్షణలేకపోవటం, అధికారులు ఇప్పటికైనా వారికి రక్షణ కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధురవాడ లో ఉన్న పందులను నిర్మూలించాలని విజ్ఞప్తి చేసారు.పందుల నిర్మూలానకు పాటుపడిన జీవీఎంసీ గన్ షూటర్ రాము, వాసు లను స్థానికులు అభినందించారు.


