మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
చంద్రంపాలెం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి పలు రకాల కూరగాయలు ఆకుకూరలు తో అలంకరణ
చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ షిర్డీ సాయినాధ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి పలు రకాల కూరగాయలు ఆకుకూరలు తో అమ్మవారిని శాకాంబరీ దేవిగా ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, హరి ప్రసాద్ శర్మ, మూర్తి శర్మ, హరి స్వామి, అలంకరించడం జరిగింది, అమ్మవారికి ఆషాడం సారె అలయ ధర్మకర్త పిళ్లా కృష్ణం నాయుడు దంపతులు, కమిటీ సభ్యులు సమర్పించడం జరిగింది.
ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు, అదే విధంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, భక్తులు తెచ్చిన పలు రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది, అమ్మవారు శాకాంబరీ దేవి కావడంతో పలు రకాల కూరగాయలతో చేసిన కదంబం ప్రసాదం అమ్మవారికి సమర్పించి తర్వాత భక్తులకు పంపిణీ చేయడం జరిగింది, ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకములు జరీపించడం జరిపించి అనంతరం నిత్య అలంకరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా కృష్ణం నాయుడు,ఆలయ కమిటీ సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, సభ్యులు పిళ్లా వెంకటరమణ, పిళ్లా వెంకట రమణ, గూడేల రాజు, పిళ్లా రమణ, పిళ్లా మోహన్ కృష్ణ, నాగోతి అప్పలరాజు, కేశనకుర్తి అప్పారావు, గ్రామ పెద్దలు పీస రామారావు పిళ్లా సత్యన్నారాయణ, ఆలయ ముఖ్య సభ్యులు, పిళ్లా పోతరాజు, పి.వెంకట రమణ, పిళ్లా అప్పన్న , పిళ్లా సూరి పాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.

