ప్రైమరీ స్కూల్ తరగతులు 3,4,5 హైస్కూల్లో విలీనం చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ను వెంటనే రద్దు చేయాలి:కోరాడ రాజబాబు


 భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

ప్రైమరీ స్కూల్ తరగతులు 3,4,5 హైస్కూల్లో విలీనం చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ను వెంటనే రద్దు చేయాలి:కోరాడ రాజబాబు

భీమిలి నియోజకవర్గం పరిధి పద్మనాభం మండలం పొట్నూరు గ్రామపంచాయతీ గుళ్ల మజ్జి వారి కల్లాలు లో ప్రైమరీ స్కూల్ తరగతులు 3,4,5 హైస్కూల్లో విలీనం చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ను వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున భీమిని నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు  విద్యార్థుల తల్లిదండ్రులతో కలిపి నిరసన తెలియజేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ ,రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, పద్నాభం మండల పార్టీ ప్రెసిడెంట్ కోరాడ రమణ, విశాఖ పార్లమెంట్ కార్యదర్శి నందీశ్వర రావు, శేరీఖండం గ్రామపంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ వాడలపల్లి సురేష్ కుమార్, ఎక్స్ సర్పంచ్ రేవిడి అప్పలనాయుడు, ఎక్స్ ఎం పి టి సి ఆవాల గంగరాజు, పళ్ళ రాము ,తదితర నాయకులు గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.