మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
స్వతంత్ర నగర్ వైయస్సార్ నాయకులు ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని భీమిలి నియోజకవర్గ జీవీఎంసీ జోన్ టు మధురవాడ స్వతంత్ర నగర్ వైయస్సార్ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల వై యస్ ఆర్ విగ్రహం వద్ద వై ఎస్ ఆర్ విగ్రహనికి పులా మాల వేసి కార్యక్రమం నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమంను ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అని, ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, 108, వృద్దులకి పెన్షన్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుడితి రామారావు,అల్లాడ లింగేశ్వరావు,పి. అప్పన్న, బెల్లాపు పాపారావు, షేక్ మహమ్మద్.షరీఫ్, షేక్.కరీం స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

