మున్సిపల్ కార్మికుల మూడవరోజు సమ్మె భగ్నం చేసిన పోలీసులు
సమ్మె లో మున్సిపల్ కార్మికులను, సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసి పి ఎమ్ పాలెం పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు. సి ఐ టి యూ
మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేయడం జగన్ ప్రభుత్వం దివాలాకోరుతనంకు నిదర్శనం. తక్షణమే రద్దు చేసిన జీతాన్ని పునరుద్దరించాలి. హెల్త్ అలవెన్స్ సాధించేవరకూ పోరాడుతాం. సి.ఐ.టి.యు .
మధురవాడ పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కనీస వేతనం, ఇతర సమస్యల పరిష్కారం కోసం న్యాయబధ్ధంగా పోరాడుతున్న మున్సిపల్ కార్మికులను పోలీసులతో అరెస్టులు చేయించడం దారుణమని, తక్షణమే మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని జగన్ ప్రభుత్వాన్ని సి.ఐ.టి.యు డిమాండ్ చే
స్తోంది.


