సాయి బాబా ను దర్శించుకున్న చిక్కాల విజయబాబు


 విశాఖ లోకల్ న్యూస్

సాయి బాబా ను దర్శించుకున్న చిక్కాల విజయబాబు

గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి  విజయ్ బాబు 43వ వార్డు సంఘం ఆఫీస్ వద్ద గల శ్రీ శ్రీ శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, సెక్రటరీ సరిసా ప్రసాద్, విశాఖ పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్, విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శి ముక్కా శివ, జిల్లా ఐటిడిపి నరేష్, 45 వ వార్డు అప్పన్న, బొడ్డేటి కన్నా రావు, రాజగిరి కన్నా రావు, కాళ్ళ శ్రీనివాసరావు, శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శి లు మరియు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.