సత్య సాయి 97వ జన్మదిన సందర్భంగా మితిలాపురి భజన మండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు.

సత్య సాయి 97వ జన్మదిన సందర్భంగా మితిలాపురి భజన మండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు.--

మధురవాడ:

నగర సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న మిథిలాపురి  కాలనీ.--
పుట్టపర్తి సత్యసాయి 97వ జన్మదిన వేడుకలు సందర్భంగా మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీ  సత్య సాయి మధురవాడ సమితి ( భజన మండలి) కన్వీనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో. 19వ తేదీ శనివారం నుండి పలు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. 97 మంది పుణ్యస్త్రీలకు కలశం  చీరల పంపిణీ చేశారు. పాత మధురవాడలో కృప సాధన అనాధ శరణాలయం పిల్లలకు 40 మందికి బుక్స్, పెన్సిల్స్, పెన్న లు, ఎరైజర్స్, పళ్ళు,సీడ్స్,స్వామివారి విభూతి ఫొటోస్, ఆటో డ్రైవర్లకు దుస్తులు, అలాగేలా కాలేజీ వద్ద బ్లైండ్ విద్యార్థులకు ఉదయం టిఫిన్ వితరణ చేశారు. మందిరం ప్రాంగణం వద్ద మొక్కలు నాటారు. అన్నదాన ప్రసాదాలు పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా సత్య సాయి బాబాను పల్లకితో ఊరేగించి,  నగర సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ తో భక్తులు పరవశించారు. మానవసేవే మాధవ సేవ అని సత్యసాయి ఆశయాలు ఆదర్శాలను అనుగుణంగా సమాజాన్ని ఉద్ధరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని భజన మండలి సభ్యులు తెలియజేశారు. మరి రెండు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించి 23వ తేదీన స్వామి జన్మదినం వేడుకలు సందర్భంగాసేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని చెప్పారు.