యువత ఉపాధి లక్ష్యంగా పనిచేస్తా ... మిలీనియం శ్రీధర్ రెడ్డి

యువత ఉపాధి లక్ష్యంగా పనిచేస్తా ... మిలీనియం శ్రీధర్ రెడ్డి

విశాఖపట్నం:విశాఖ లోకల్ ప్రతినిధి : నవంబర్ 21:

ఆంధ్రప్రదేశ్ స్కిల్స్  ట్రైనింగ్ మరియు జాబ్ ఫెయిర్స్  సలహాదారునిగా నియమితులైన గాదె శ్రీధర్ రెడ్డి సోమవారం ఎం.పి.విజయసాయి రెడ్డిని విజయవాడలో గల ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మిలినీయం శ్రీధర్ రెడ్డి విజయ సాయిరెడ్డి ని దుస్సాల్వతో సత్కరించి పూల మొక్కను అందజేశారు. అనంతరం విజయ సాయిరెడ్డి యువత ఉద్యోగ కల్పనకు  ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని శ్రీధర్ రెడ్డి కి తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడుతూ అయన లక్ష్యం కోసం సైనికునిలా పనిచేస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తాను ప్రత్యేక దృష్టి సారించి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తన విధులు నిర్వహిస్తానని శ్రీధర్ రెడ్డి అన్నారు.