ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన రైలు.. 10 బోగీలు బోల్తా.

ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన రైలు.. 10 బోగీలు బోల్తా

జాజ్‌పూర్‌:

జాజ్‌పూర్‌: ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గూడ్స్‌ బోగీల కింద మరికొంతమంది చిక్కుకున్నారని సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.