మానవాళికి దిశా నిర్దేశం చేసేది పాత్రికేయులే..!భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్.
ఉన్నత విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి ఎంతోఅవసరం.
సమాజ సేవకు జర్నలిస్టుల కృషిఅమోఘం.
వి.జె.ఎఫ్.అందించిన ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల గ్రహీతలు బొల్లుకృష్ణారావు, కె.తోటరామునాయుడు ల ఆత్మీయసన్మాన కార్యక్రమంలో వక్తలు. మధురవాడ: వి న్యూస్
ప్రజలను చైతన్యవంతులను చేసి దిశ నిర్దేశాలను చేసేది పాత్రికేయలేనని,విలువలతో కూడిన పాత్రికేయుల సేవలు సమాజహితానికి తోడ్పడతాయని మాజీ మంత్రి,భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు.ఇటీవల వి.జె.ఎఫ్.ప్రతిష్టాత్మక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీతలు సీనియర్ జర్నలిస్ట్ లు బొల్లుకృష్ణారావు(విశాలాంధ్ర), కె.తోటరామునాయుడు(సాక్షి), లకు మధురవాడ జర్నలిస్ట్ మిత్రులు ఆత్మీయ సన్మాన సత్కార అభినందన సభ నిర్వహించింది.
ఈసందర్బంగా మధురవాడ కొమ్మాది జంక్షన్ త్రిశక్తి దేవాలయ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్,జీవీఎంసీ 5వ వార్డు కొర్పోరేటర్ మొల్లి హేమలత, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ సందీప్ పంచకర్ల..ముఖ్య అతిదులుగా పాల్గొని సన్మాన గ్రహీతలకు దుశ్శాలువ గజమాలలు,శాలువాల లతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీమంత్రి అవంతి మాట్లాడుతూ సమాజానికి పాత్రికేయుల సేవలు ఏంతో అవసరమన్నారు.సమాజసేలో అత్యుత్తమ ప్రతిభకనబరిచే జర్నలిస్టులను గుర్తించి విజేఎఫ్ అందించిన ఉత్తమ జర్నలిస్ట్ ల అవార్డ్ అందుకున్న బొల్లుకృష్ణారావు (విశాలాంధ్ర), కె.తోటరామునాయుడు(సాక్షి) సేవలు కొనియాడక తప్పదన్నారు.5వ వార్డు కొర్పోరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ..సమాజ సేవకు జర్నలిస్టులు కృషి చేయాలి,సమాజ హితం కోసం జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించాలన్నారు.
సమాజ సంక్షేమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.నవసమాజ నిర్మాణంలో పాత్రికేయులపాత్ర చాలా కీలకమన్నారు.జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ.. జర్నలిస్టులు లేని సమాజం వ్యర్థమన్నారు,ఉన్నత విలువలతో కూడిన జర్నలిజం ఈసమాజానికి ఎంతో అవసరం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలోనియోజకవర్గ ఇన్చార్జ్ మహేష్,వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఈఎన్ఎస్ చందర్రావు,పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, 5,6,7,వార్డుల అధ్యక్షులు పోతినహనుమంతరావు, బోట్టఅప్పలరాజు,పోతిన శ్రీనివాసరావు,వాండ్రాసి రవికుమార్,సంజీవ్ యాదవ్,పోతినమూర్తిబాబు, పిళ్ళరమణ,చేకూరిరజని, కుడితి రామారావు, నూకవరపుబాబ్జి,టీడీపీ నాయకులు మొల్లిలక్ష్మణరావు,వాండ్రాసి అప్పలరాజు,బోయిశ్రీను,బోయిరమాదేవి,నమ్మిశ్రీను,గురునాథ్, మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్క శ్రీధర్, కనకదుర్గ ఈవెంట్స్ అధినేత కోర్రాయిసురేష్,బిజెపి నాయకులు ప్రదీప్,సిపిఎం అప్పలరాజు,రాజ్ కుమార్,జనసేన పార్టీ... బి.వి.కృష్ణయ్య,పోతిన అనురాధ,పౌర సేవాసంఘం అధ్యక్షులు నాగోతి సూర్యప్రకాష్,జగన్మోహన చౌదరి,రమేష్, వంటాకుల శ్రీనివాస్,ఆశాజ్యోతి, నాగేశ్వరరావు,జీవీఎంసీ ఏసీపీ శాస్త్రి షహనాబ్,ఎలక్ట్రికల్ ఏఈ రామ్మూర్తి,మధురవాడ మీడియామిత్రులు పాల్గొన్నారు.


