ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గడప గడపకు అనేది ఇది చక్కటి కార్యక్రమం...అవంతి:శ్రీనివాసరావు

 ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గడప గడపకు అనేది ఇది చక్కటి కార్యక్రమం...అవంతి:శ్రీనివాసరావు

మధురవాడ వి న్యూస్ ప్రతినిధి:

భీమిలి నియోజకవర్గం పరిది లో గల జీవియంసి 7వ వార్డు జోన్ 2 పరిధిలోని లో మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఇచ్చిన హామీలకు ఆర్టిసి కోలనీ  డ్రెనేజీ వ్యవస్థ నిర్మాణం మరియు సిసి రోడ్లు నిర్మాణం కోసం 76 లక్షల 41 వేలు రూపాయిలు మరియు పిలకవాని పాలెం, పోతినమల్లయ్యపాలెం సిసి రోడ్డు మరియు డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణం కోసం 38 లక్షల 70 వేలు రూ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు  చేతులు మీదుగా శంకుస్థాపనలు చేయడం జరిగింది.

అనంతరం  ప్రజలతో మాట్లాడుతూ వార్డులో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు  మాట్లాడుతూ  గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం చాలా మంచి విషయం అని దీని ద్వారా నియోజకవర్గం లో పర్యటనలు ద్వారా ప్రజలు మధ్యకి వెళ్ళి వారి సమస్యలు నెరుగా తెలుసుకునే చక్కటి అవకాశం లభించిందని మేము అందిస్తున్న పాలన పై ఓ అధ్యయనం అని అదే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో బాగంగా గుర్తించిన సమస్యలకు నేడు నిదులుతో పనులు ప్రారంభించడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు. 

గత ప్రభుత్వాలు అభివృద్ధి ని మరిస్తే నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలు అమలు పాలన అంటే ఇది అనేలా చేస్తున్నారని నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడపడంలో ముందుంటానని అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ అధికారులు  వార్డు కార్పోరేటర్ లు వార్డు ఇంచార్జ్ లు వార్డు ప్రెసిడెంట్ లు ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.