నగరాలు సామాజిక వర్గం సమస్యలపై సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి వినతిపత్రం

 నగరాలు సామాజిక వర్గం సమస్యలపై సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి వినతిపత్రం

విజయవాడ వి న్యూస్ ప్రతినిధి:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం    లో నిర్వహించిన రాష్ట్ర వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  ఆధ్వర్యంలో జరిగిన  56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు మరియు డైరెక్టర్లతో సమావేశం పాల్గొన్న నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ. 

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ  జి. జయలక్ష్మి ఐ.ఏ.ఎస్ ని కలిసి నగరాలు సామాజిక వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల నగరాలు సామాజిక వర్గం సమస్యలపై బిసి కమిషన్ చైర్మన్,  రాజ్యసభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి  రాసిన సిఫారసు లేఖను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.వీలైనంత త్వరగా నగరాలు సామాజిక వర్గం  సమస్యను పరిష్కరించాలని జి.జయ లక్ష్మీ ఐ ఏ ఎస్ ని  నగరాలు కార్పొరేషన్ చైర్మన్ పిళ్ళా సుజాత కోరారు.