తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సభ్యత్వం తీసుకోవాలి:భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరడ రాజబాబు పిలుపు.
ఆనందపురం:విశాఖ లోకల్ న్యూస్ :
ఆనందపురం మండల విస్తృత స్థాయి సమావేశంలో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరడ రాజబాబు పిలుపు ఆనందపురం మండల తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం వేములవలస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ,ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొరకు భీమిని నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు మాట్లాడుతూ మండలంలో ఉన్న 26 పంచాయతీల్లో సభ్యత నమోదు కార్యక్రమం జరగాలని ప్రతి పంచాయతీలో ఉన్న నాయకులు బాధ్యతగా సభ్యత్వాన్ని చేయించాలని కార్యకర్తలు అందరికీ ఉపయోగపడే జీవిత బీమా ఈ సభ్యత్వంలో పొందుపరచబడిందని కనుక తెలుగుదేశం కార్యకర్త అనే వారందరూ తప్పనిసరిగా సభ్యత్వం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు తో పాటు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు మరుపల్లి రాజేంద్రప్రసాద్ ఆనందపురం మండల ఎక్స్ వైస్ ఎంపీపీ మీసాల సత్యనారాయణ సీనియర్ నాయకులు నారాయణ రావు జడ్పిటిసి అభ్యర్థి తాట్రాజ్ అప్పారావు సీనియర్ నాయకులు చెన్నా నర్సింగరావు సర్పంచులు బలిరెడ్డి మల్లికార్జున రావు (చంటి) సిర్ల అప్పలనాయుడు విశాఖ పార్లమెంట్ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్రెడ్డి రమేష్ ఎంపీటీసీలు దొంతల కనకరాజు పడాల అప్పలనాయుడు రెడ్డి బాబు ఎక్స్ ఎంపీటీసీ లోడగల వెంకటరమణ మండల యువత అధ్యక్షులు ఎర్ర బంగారనాయుడు (బన్నీ ) మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


