ఆనందపురం మండలం హైస్కూల్ లో అమ్మ ఒడి కార్యక్రమం.
ఆనందపురం :విశాఖ లోకల్ న్యూస్.
మంగళవారం నాడు ఆనందపురం మండలం హైస్కూల్ నందు అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమం లో బాగంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో పలు సంస్కరణలు చేసారని అందులో ముఖ్యంగా నాడు నేడు లో పాఠశాలలు సుందరీకరణ అదనపు తరగతి గదులు నిర్మాణం వసతులు తో ప్రైవేటు స్కూల్ కు దీటుగా తయారు చేయడం జరిగిందని,విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు కిట్లులు పౌష్టికాహారం ఇలా ప్రతీది చేసి విద్యలో నూతన ఒరవడి తీసుకువచ్చారని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సంఖ్య తో పాటు ఉత్తీర్ణత శాతం పెరిగిందని మాట్లాడారు. అనంతరం ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలో జమ చేసిన 8 కోట్ల 30 లక్షల 44 వేల రూ. చెక్కును జగనన్న విద్యా కానుక కిట్టు లను అవంతి శ్రీనివాసరావు చేతులు మీదుగా విద్యార్థులు కు అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ ముత్తంశెట్టి మహేష్,యంపిపి మజ్జి ప్రియాంక,జెడ్పిటిసి కోరాడ వెంకట్రావు,మండల పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యం గారు,వైస్ యంపిపి లు, సర్పంచ్ లు, యంపిటిసి లు,ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
