శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం


విశాఖ లోకల్ న్యూస్ :సింహాచలం 

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో దేవాలయమునకు ఉత్తరాన ఉన్న పర్వత శిఖరాన వెలసిన శ్రీవైకుంఠవాసులు మెట్ట మీద శ్రీవైకుంఠవాసులకు విశేష ఆరాధన స్నపన తిరుమంజనం, విరాట పర్వం పారాయణం జరిపించి పాయసం నివేదన జరిపించి నివేదితమైన పాయసాన్ని ప్రక్కనున్న బండ పై కుమ్మరించిన సువృష్టి చేసి దేశం సస్యశ్యామలంగా ఉండునని అచంచలమైన విశ్వాసంతో చిరకాలముగా వరద పాయసం పోయడం పరిపాటి అట్టి సాంప్రదాయం ప్రకారం జులై 7వ తేదీ బుధవారం నాడు శ్రీవైకుంఠవాసులకు వరద పాయసం పోయాలని వైదిక వర్గాలు నిర్ణయం చేయడం జరిగినది. ఆ ప్రకారం జులై 7వ తేదీ ఉదయం గం..8.00ల నుండి పూజా కార్యక్రమములు ప్రారంభమగును.అని ఈ ఓ.ఎమ్.వి.సూర్యకళ కార్యనిర్వణాధికారి తెలిపారు.