విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ సందడి మొదలు కానుంది


 విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ సందడి మొదలు                           కానుంది.....

*11 రోజుల పాటు పండగ వాతావరణం కల్పించనున్న పీఎం పాలెం ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం.

*  ప్రతి జిల్లాలో ఉన్న క్రీడాకారుల ప్రతిభ చూపేందుకు అవకాశం కల్పించిన ఏ పీ ఎల్....

* ప్రేక్షకులకు ఉచిత అవకాశం కల్పించిన ఏ పీ ఎల్ సభ్యులు


మధురవాడ : విశాఖ లోకల్ న్యూస్

పిఎం పాలెం ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏ పీ ఎల్ టి 20 క్రికెట్ జెర్సీ ట్రోఫీ నీ సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమిలి ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున రావు, సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా పాల్గొని జెర్సీ లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ పీ ఎల్ టి20 ప్రీమియర్ లీగ్ ద్వారా జిల్లా స్థాయిలో క్రికెట్ క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని అన్నారు. ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా క్రీడాకారులు యొక్క ప్రతిభను చూపేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ తరహా లీగ్ ని ప్రారంభించిందని అన్నారు. కులమతాలకు, రాజకీయాలకతీతంగా ఒక్క క్రికెట్ లోనే మనం చూస్తున్నామని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే దేశమంతా ఒక్కటై ఇండియా గెలవాలని కోరుకునేల ఈ క్రికెట్ క్రీడ ద్వారా దేశాన్ని ఒకటిగా చేస్తుంది అని అన్నారు. ఈ ప్రీమియర్ లీగ్ లో ప్రతి క్రీడాకారుడు వారి ప్రతిభను చాటే విధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏసీఏ ట్రెజరర్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దాదాపుగా ఈనెల ఆరో తేదీ నుండి 17వ తేదీ వరకు దాదాపు 11 రోజులపాటు పి ఎం పాలెం ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం లో ఎపీఎల్ టి20 ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచులు జరగనున్నాయని తెలిపారు. ఈ లీగ్లో  వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్,మార్లిన్ గోదావరి టైటాన్స్, కె.వి.ఆర్ ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, బెజవాడ టైగర్స్  ఆరు టీములు పోటీ పడుతున్నాయని అని అన్నారు. ఈ టి 20 మ్యాచ్ లు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడున్నర వరకు డే మ్యాచ్, సాయంత్రం ఆరునుండి రాత్రి 9:30 వరకు డే అండ్ నైట్ మ్యాచ్ చొప్పున రోజుకి రెండు మ్యాచ్లు జరుగుతాయి అని ఆయన తెలిపారు. ఈ ఏ పి ఎల్ టి 20 క్రికెట్ మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి అని ఆయన తెలిపారు. ఏ పి ఎల్ టి20 క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఈనెల 17వ తేదీన జరుగుతుందని గెలిచిన వారికి 25 లక్షలు ప్రైస్ మనీ, రన్నరప్ గా నిలిచిన వారికి 15 లక్షలు ఇస్తున్నామని అన్నారు. ఒక్కొక్క టీం కి 70 నుండి 80 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఈ ఆరు టీములు ద్వారా 120 మంది క్రీడాకారులు ఈ లీగ్లో అడనున్నరు అని అన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ ఆశించకుండా వేలం ద్వారా క్రీడాకారులను కొనుక్కొని ఏ పీ ఎల్ టి 20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.11 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నామని సంస్థ సభ్యులు తెలిపారు. ఇటువంటి తరహా క్రికెట్ లీగ్ లు ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, సౌరాష్ట్ర ల లో విజయవంతంగా నిర్వహించారన్నారు. ప్రస్తుతం ఈ నాలుగో లీగ్ నీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఏ పీ ఎల్ టి20 గా నిర్వహించి జిల్లాలో ఉన్న క్రికెట్ క్రీడాకారులకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని ఈ అవకాశం ద్వారా వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం

జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసి మేయర్ హరి వెంకట కుమారి, జివిఎంసి కమిషనర్ లక్ష్మీశ క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో వెంకటశివారెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, జి వి వి గోపాల్ రాజ్, అనురాధ తదితర కౌన్సిల్ నెంబర్ సభ్యులు పాల్గొన్నారు.