భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
వేములవలస మార్కెట్ వేములవలస లోనే ఉండాలి ఎట్టి పరిస్థితిలో మార్చడానికి వీల్లేదు భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు
భీమిలి నియోజకవర్గ పరిధి ఆనందపురం మండలం వేములవలస గ్రామం లో గల మహాత్మా గాంధీ రోజు వారి మార్కెట్ వేరే చోటుకు తరలించడానికి అభిప్రాయసేకరణ చేయుట కొరకు జిల్లా పంచాయతీ అధికారి ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయగా ఎట్టి పరిస్థితిలో వేములవలస మహాత్మా గాంధీ మార్కెట్ తరలించడానికి వీల్లేదని ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ స్థానంలోనే గత 50 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని అలాగే వేములవలస మార్కెట్ 1997లో గెజిట్ పబ్లికేషన్ అయ్యి శ్రీ జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి పొంది నిర్వహించడం జరుగుతుంది. కావున మార్కెట్ వేరే చోటికి తరలించడానికి వీల్లేదని అలాగే వేములవలస మేజర్ పంచాయతీ సంవత్సరానికి ఈ మార్కెట్ ద్వారా కోటి ఇరవై ఆరు లక్షలు రూపాయలు ఆదాయాన్ని సమకూర్చిందని ఈ మార్కెట్ను తరలిస్తే పంచాయతీలో వీధిలైట్లు గాని శానిటేషన్ మరియు అభివృద్ధి పనులు చేయటానికి కూడా గ్రామపంచాయతీకి వేరే ఆధారం లేదని తెలుపుతూ అలాగే ఈ మార్కెట్ కు పర్మినెంట్ షాపులు కట్టడానికి పంచాయతీ తీర్మానం జరిగిందని కనుక ఎట్టి పరిస్థితిలో ఈ మార్కెట్ ని యదా స్థితిలో ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి గారికి భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో వేములవలస గ్రామపంచాయతీ సర్పంచ్ లంక కొండమ్మ తెలుగుదేశం పార్టీ తరపున వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేములవలస గ్రామ నాయకులు వ్యాపారస్తులు ప్రజలు పాల్గొనడం జరిగింది

