విశాఖ లోకల్ న్యూస్:
సమాజానికి డాక్టర్ బొడ్డేపల్లి రఘు చేస్తున్న సేవలు మరువలేనివి: మాజీ మంత్రి, ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు
జన్మదిన వేడుకలు అర్బటలు లేకుండా సేవా దృక్పధం తో నిర్వహించు కుంటున్న బొడ్డేపల్లి రఘు అభినంద నీయుడని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయ్ ప్రసాద్ కొనియాడారు.
జనసేన పార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్, సురక్ష హాస్పిటల్స్ అధినేత బొడ్డెపల్లి రఘు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చిరంజీవి, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ, బొగ్గు శ్రీను మిత్రమండలి, డాక్టర్ బొడ్డేపల్లి రఘు యువసేన ఆధ్వర్యంలో నగరంలో బెస్ట్ వెస్టన్ హోటల్లో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గంటా శ్రీనివాసరావు, మళ్ళా విజయ్ ప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేయించి,ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ బొడ్డేపల్లి రఘు సమాజానికి చేస్తున్న సేవలను ప్రశంసించారు.కోవిడ్ సమయంలో సురక్ష హాస్పిటల్స్ ద్వారా ఎంతో మంది నిరుపేదల ప్రాణాలు కాపాడిన వ్యక్తి డాక్టర్ బొడ్డేపల్లి రఘు అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో బొగ్గు శీను మిత్రమండలి వ్యవస్థాపకుడు బొగ్గు శ్రీను, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పసుపులేటి ఉషాకిరణ్ తోపాటు అధిక సంఖ్యలో మహిళలు పార్టీ శ్రేణులు వీరా మహిళలు పాల్గొన్నారు .

